/గంగానదిలో అస్తికలు కలిపేందుకు సరికొత్త పోర్టల్ తో ముందుకొచ్చిన పోస్టల్‌ శాఖ
గంగానదిలో అస్తికలు కలిపేందుకు సరికొత్త పోర్టల్ తో ముందుకొచ్చిన పోస్టల్‌ శాఖ

గంగానదిలో అస్తికలు కలిపేందుకు సరికొత్త పోర్టల్ తో ముందుకొచ్చిన పోస్టల్‌ శాఖ


ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వినూత్నంగా చనిపోయినవారి అస్థికలు గంగానదిలో కలిపేందుకు ఒక నూతన విధానాన్ని  తీసుకొచ్చింది. అదే స్పీడ్‌ పోస్ట్‌. 

కరోనా విలయ తాండవం ఒకపక్క, లాక్ డౌన్ మరోపక్క ఈ నేపథ్యంలో చనిపోయిన వారికి మరణానంతర క్రతువులు నిర్వహించడం కూడా చాలా  కష్టంగా మారింది. సాదారణంగా మరణించిన వారి అస్థికలని గంగానదిలో కలపడాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కానీ, ప్రస్తుత సమయంలో ఇది సాధ్యం కాని పని. దీంతో భారతీయ పోస్టల్ శాఖ ఆ బాధ్యత తీసుకుంది. 

దేశంలో ఎక్కడి నుంచైనా ఆస్థికలు స్పీడ్‌ పోస్ట్‌ లో పంపితే… వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. వారణాసిలోని ఓమ్​ దివ్య దర్శన్ అనే సోషియో రెలిజియస్ ప్లాట్ ఫాంతో కలిసి సంయుక్తంగా స్పీడ్ పోస్ట్ విధానాన్ని ప్రారంభించింది. దీనిద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా అస్థికలను స్పీడ్ పోస్ట్ ద్వారా ​ఓమ్​ దివ్య దర్శన్ కార్యాలయానికి పంపించవచ్చు. వీటిని ఎన్​జీఓ సిబ్బంది తీసుకువెళ్ళి వారణాసి, ప్రయాగ్​రాజ్​, హరిద్వార్​, గయా వంటి ప్రముఖ స్థలాలో ఉన్న గంగా నదిలో నిమజ్జనం చేస్తారు. అయితే స్పీడ్ పోస్ట్ చేసేవారు ముందుగా ఓమ్​ దివ్య దర్శన్ పోర్టల్​లో పేరు నమోదు చేసుకోవాలి.

ఓమ్​ దివ్య దర్శన్ సేవాసంస్థ సభ్యులు శాస్త్రోక్తంగా అస్థికలు నిమజ్జనం చేసిన తర్వాత గంగానది నీటిని ఒక బాటిల్లో తిరిగి ఆయా కుటుంబ సభ్యులకు పోస్ట్ ద్వారా పంపిస్తారు.

Original Source