/రూ. 25 వేలకే ట్యాబ్‌ కం ల్యాప్‌టాప్
ASUS Launched Chromebook Detachable CM3

రూ. 25 వేలకే ట్యాబ్‌ కం ల్యాప్‌టాప్


బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన అసుస్ కొత్త డిటాచబుల్ సీఎం3 క్రోమ్‌బుక్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోల్డబుల్ క్రోమ్‌బుక్‌ని ల్యాప్ టాప్ లా ఉపయోగించుకోవచ్చు, విడదీసి ట్యాబ్లెట్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. దీని ఫీచర్స్, మరియు స్పెసిఫికేషన్స్ కూడా లెనోవో క్రోమ్‌బుక్ తరహాలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ల్యాప్ టాప్… మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. అయితే దీని ధర మాత్రం రూ.25 వేల రేంజ్‌లోనే ఉంది.

అసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీఎం3 వేరియంట్లు ధరలు:

ఈ  క్రోమ్‌బుక్స్ రెండు డిఫరెంట్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లు అంటే (సుమారు రూ.25,500) గా ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లు అంటే (సుమారు రూ.27,000) గా ఉంది. మినరల్ గ్రే కలర్ లో ఇది అందుబాటులో ఉంది.

అసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీఎం3 ఫీచర్స్, అండ్ స్పెసిఫికేషన్స్: 

ఈ క్రోమ్‌ OS ల్యాప్ టాప్ 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10 గా ఉంది. స్టైలస్ సపోర్ట్ ని కూడా కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. 4 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ వరకు eMMC స్టోరేజ్‌ని అందించారు.

ఇక డిటాచబుల్ కీబోర్డ్ అంటే… కీబోర్డును తీసేసి టచ్ ట్యాబ్లెట్‌లాగా కూడా దీన్ని ఉపయోగించే ఫెసిలిటీ కల్పించారు. వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 2 మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉన్నాయి. ల్యాండ్ స్కేప్, మరియు పొర్‌ట్రెయిట్ ఫార్మాట్లలో దీన్ని ఉపయోగించేందుకు డిటాచబుల్ ఫ్యాబ్రిక్ కవర్‌ను కూడా దీంతోపాటు ఇవ్వడం జరిగింది.

ఇందులో 3.5 mm ఆడియోజాక్, USB టైప్-సీ పోర్టును కూడా ఉంచారు. 27Whr బ్యాటరీని కలిగి ఉండి… 45W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 510 గ్రాములు, మందం 0.79 సెంటీమీటర్లు ఉంది.

Original Source