/జూన్ 30 వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
Paytm Brings Free Cylinder Offer upto June 30

జూన్ 30 వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు


మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని అనుకుంటున్నట్లు అయితే ఒక్క క్షణం ఆగండి!  మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది.  పేటీఎం ఒక గొప్ప ఆఫర్ ని తీసుకువచ్చింది. మీరు బుక్ చేయాలనుకుంటున్న LPG సిలెండర్ ని పేటీఎం ద్వారా బుక్ చేసినట్లయితే ,  మీరు ఉచితంగానే సిలిండర్ పొందే అవకాశముంది.

ఇటీవలికాలంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం నిలకడగానే ఉంటూ వచ్చింది. జూన్ నెలలో సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం దిగొచ్చింది

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.809 గా  ఉంటే… కోల్‌కతాలో రూ.835… ముంబైలో రూ.809…చెన్నైలో రూ.825 గా ఉంది. కానీ, ఇవేవీ కాకుండా ఉచితంగా సిలిండర్ పొందే ఛాన్స్ అందుబాటులో ఉంది.

పేటీఎం గ్యాస్ సిలిండర్ వాడే వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. అయితే పేటీఎం ద్వారా తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ ఆఫర్ జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.809 కాగా, క్యాష్ బ్యాక్ ధర రూ.800 అయితే. .. మీకు సిలిండర్ ఉచితంగా లభించినట్లే! అయితే, ఈ ఆఫర్ అందుకోవటం కోసం మీరు ఫస్ట్ఎల్‌పీజీ అనే ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది.

Original Source