/‘సెహరి’ టైటిల్ సాంగ్ రిలీజ్
'సెహరి' టైటిల్ సాంగ్ రిలీజ్

‘సెహరి’ టైటిల్ సాంగ్ రిలీజ్


జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ నే అందించింది. ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ‘సెహరి’ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

‘కచడ కచడా హోగయా.. అర్థమైతలేదయా.. అచ్చట ముచ్చట లేదయా.. వసపడతలే ఏందయ్యా’ అంటూ సాగే ఈ పాటకి ప్రశాంత్ ఆర్ విహారీ ట్యూన్ సమకూర్చారు. చౌరస్తా రామ్ మిరియాల తనదైన శైలిలో హుషారుగా దీనిని ఆలపించారు. ‘ఏసిన పెగ్గు వేస్తా ఉన్నా కిక్కే వస్త లేదే.. అందరి నసీబ్ రాసినోడు నన్నే దేకలేదే’ అంటూ యూత్ ని ఆకట్టుకునేలా సాహిత్యం అందించారు లిరిసిస్ట్ భాస్కర భట్ల. ఇక యష్ మాస్టర్ కొరియోగ్రఫీ, హర్ష కనుమల్లి వేసిన స్టెప్స్ విపరీతంగా అలరిస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీని హీరో హర్ష కనుమల్లి అందించారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందించారు. రవితేజ గిరజాల ఎడిటింగ్ అందిస్తున్న ఈ చిత్రంలో  అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి, మరియు  శిల్పా చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ అతి త్వరలోనే ప్రేక్షకులని అలరించబోతోంది.

 

Original Source