/ట్రెండింగ్ గా మారిన ‘సింగిల్ చిన్నోడే’ లిరికల్ వీడియో సాంగ్
‘Single Chinnode’ Song has become to Trending on Youtube

ట్రెండింగ్ గా మారిన ‘సింగిల్ చిన్నోడే’ లిరికల్ వీడియో సాంగ్


విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. ఈ చిత్రానికి సంబందించిన లిరికల్ వీడియో సాంగ్ ని జూన్ 2న విడుదల చేశారు. ‘ఈ సింగిల్ చిన్నోడే’ అంటూ సాగే ఈ సాంగ్ స్పెషల్ గా సింగిల్స్ కోసమే అన్నట్లు ఉంది. బెన్నీ దయాల్ ఆలపించిన ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. రిలీజైన అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ వ్యూస్ సాధించింది. 

ఈ సాంగ్ ఇంతలా పాపులర్ అవ్వడానికి కారణం ఇది యూత్ ను బాగా అట్రాక్ట్ చేయడమే! ముఖ్యంగా సింగిల్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ లో విశ్వక్ ఫ్రెష్ లుక్ కు అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో పెరిగాయి. 

ఈ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐతే కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ అయింది. మరి మీరు కూడా ‘ఈ సింగిల్ చిన్నోడే” లిరికల్ సాంగ్ పై ఓ లుక్కేయండి.

Original Source