అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల అయింది. అగ్నిపథ్ పథకం 2022 కి సంబంధించి అగ్నివీర్ తొలి నోటిషికేషన్ జూన్ 24వ తేదీ విడుదల కానుంది. సైన్యంలోని మూడు విభాగాలలోనూ ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో… త్రివిధ ఆర్మీ కమాండర్లు పాల్గొన్నారు.
జూన్ 24న ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్స్ పునఃప్రారంభం అవుతుంది. జూన్ 25న నేవీలో నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. జూలై 1న ఆర్మీలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, రెండు రోజుల్లో అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
- జూన్ 24 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
- అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ అయిన http://joinindianarmy.nic.in లో చూసి తెలుసుకోవచ్చు. మొదటి దశ పరీక్ష జూలై 24న జరుగుతుంది.
- ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల శిక్షణకి సంబంధించి మొదటి బ్యాచ్ డిసెంబర్ 30 నుంచి ప్రారంభం అవుతుంది. అందుకే, ఈలోపే రిక్రూట్ మెంట్ పూర్తవుతుంది.
- అగ్నివీర్స్ కోసం నేవీలో జూన్ 25న ప్రకటన రానుంది.
- నేవీలో అగ్నివీర్ల నియామక ప్రక్రియ నెల రోజుల్లో ప్రారంభం కానుంది.
- నేవీలో మొదటి బ్యాచ్‌కి చెందిన అగ్నివీర్ రిపోర్టింగ్ నవంబర్ 21 నుండి ప్రారంభించనున్నారు.
- ఆర్మీలో అగ్నివీర్ ఉద్యోగాల భర్తీకి జూలై 1న నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
- ఆర్మీలో అగ్నివీర్ల రిక్రూట్మెంట్ కోసం, ఆగస్టు ఫస్టాఫ్ లో ర్యాలీ ప్రారంభమవుతుంది, ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కొనసాగుతుంది.
- ఆర్మీలోకి మొదటి బ్యాచ్ అగ్నివీర్లు డిసెంబరు మొదటి లేదా రెండో వారంలో రానున్నారు.