ప్రపంచ మార్కెట్ ని శాసిస్తున్నవి రెండే రెండు కంపెనీలు. వాటిలో ఒకటి గూగుల్ అయితే… మరొకటి యాపిల్. యాపిల్‌, గూగుల్ రెండూ కూడా టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థలు. యాపిల్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంటే… గూగుల్ కంపెనీ సెర్చ్‌ ఇంజిన్‌లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది. అందుకే, ఎన్ని కంపెనీలు వచ్చినా మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. 

అయితే, రీసెంట్ గా యాపిల్ సంస్థ తన సొంత సెర్చ్‌ ఇంజిన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటివరకూ ఎన్నో సెర్చ్ ఇంజన్ కంపెనీలు ఉన్నప్పటికీ, గూగుల్ ని మించింది వేరొకటి లేదు. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని యాపిల్ ఆక్రమించబోతోంది. 

యాపిల్‌ సొంతంగా వెబ్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను తయారు చేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కూడా పలుమార్లు ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కానీ, ఈసారి మాత్రం పక్కా… అంటున్నారు. 

టెక్ బ్లాగర్ రాబర్ట్ స్కోబుల్ WWDC 2023లో యాపిల్ కంపెనీ కొత్తగా లాంచ్ చేయబోయే ప్రొడక్ట్స్ గురించి ముందుగానే అనౌన్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సెప్టెంబర్‌లో జరగబోయే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ 2022లో లాంచ్ చేయబోయే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ప్రోడక్ట్ ఇదేనని పేర్కొన్నాడు. ఇక యాపిల్ సెర్చ్ ఇంజిన్ పూర్తిగా వినియోగంలోకి రావాలంటే, జనవరి 2023 వరకు వేచి ఉండాల్సందే!

Leave a Reply

Your email address will not be published.