Wednesday, October 27, 2021

APPSC జాబ్‌ నోటిఫికేషన్‌: 38 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నెల్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపధ్యంలో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) కూడా కొన్ని పోస్టులకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 

ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన పోస్టుల్లో అసిస్టెంట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ రిలేషన్ ఆఫీసర్‌ (ఏపీఆర్వో) (6), అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (29), ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (1), హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2 (2) పోస్టులున్నాయి. ఈ 38 పోస్టుల భర్తీకి అక్టోబర్‌ లో నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ పోస్టులకు సంబంధించి నవంబర్‌ 12 నుంచి డిసెంబర్‌ 7 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ చూడచ్చు. 

ముఖ్య సమాచారం:

  • విద్యార్హత: పోస్టులను బట్టి విద్యార్హతలున్నాయి. 
  • వయసు: జులై 1, 2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్‌ 12, 2021
  • దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 7, 2021
  • వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
2,995FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles