IDBI Recruitment 2022 for 1544 Posts

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 1544 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇందులో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. జూన్ 3, 2022 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.   ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా సరే బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ idbibank.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 17, 2022.

మొత్తం వేకెన్సీస్:

వీటిలో 418 ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి.  ఇందులో:

అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు PGDBAF 2022-2023 కోర్సు ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. వీటిలో 200 పోస్ట్‌లు అన్‌రిజర్వ్‌డ్ గా ఉన్నాయి. వీటిలో: 

ఈ పోస్టులకు దరఖాస్తులు జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ జూన్ 17, 2022. ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం జూలై 9, 2022న ఆన్‌లైన్ పరీక్ష, PGBDF పోస్టుల కోసం జూలై 23, 2022న నిర్వహించబడుతుంది.

అర్హతలు: 

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ కానీ, లేదా దానికి సమానమైన విద్యార్హత కానీ ఉన్న అభ్యర్థులు ఈ  పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 

వయస్సు: 

ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్లు వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ:

ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలానే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 

ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్‌ చేసుకుంటారు. ఈ నియామకం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. తర్వాత పనితీరు ఆధారంగా పెంచుతారు. మూడేళ్లు పూర్తయిన తర్వాత, ఈ అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A పోస్టుకు అర్హులుగా మారతారు. అలా కాకుండా ఏదైనా ఖాళీ ఏర్పడితే, ఎంపిక ప్రక్రియ ద్వారా బ్యాంక్ వారిని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ Aగా ప్రమోట్ చేయవచ్చు.

జీతం:

మొదటి సంవత్సరం – రూ. 29000

రెండవ సంవత్సరం – రూ. 31000 

మూడవ సంవత్సరం –  రూ. 34000

అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A పోస్టులు:

ఈ పోస్టులను PGDBF 2022-23లో అడ్మిషన్ ఆధారంగా రిక్రూట్‌ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఏడాదిపాటు పీజీ డిప్లొమా కోర్సులో శిక్షణ ఇస్తారు. అభ్యర్థి అన్ని షరతులను పూర్తి చేసినట్లయితే, కోర్సు పూర్తయిన తర్వాత, బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A పోస్ట్ కోసం అభ్యర్థిని రిక్రూట్ చేస్తుంది. అయితే, కోర్సు ఫీజు రూ.3.5 లక్షలు దాకా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.