బీజేపీ, జనసేనల మధ్య సీఎం సీటు పంచాయితీ నడుస్తోంది. రెండు పార్టీల పొత్తుపై గత కొద్ది కాలంగా డిస్కషన్ జరుగుతోంది. ఇక బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వడంలో డిలే చేస్తోందని జనసేన భావిస్తుంటే… అదేం లేదని బీజేపీ చెప్తోంది.

ఈ నేపధ్యంలో బీజేపీ-జనసేన కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్‌ పేరును ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చాలా చర్చనీయంశాలుగా మారాయి.

ఇందులో బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మొదటి ఆప్షన్ అయితే… బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం రెండో ఆప్షన్ కాగా… జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం మూడో ఆప్షన్ అని… పవన్ పేర్కొన్నారు. ఇలా కూటమి ఏదైనా సరే జనసేన ముందుండి నడిపిస్తుందన్నారు. పొత్తుల విషయం మీరే తేల్చుకోండి అని సవాలు విసిరారు.

ఒకపక్క అసలే వేడెక్కిన రాజకీయాలతో రాష్ట్రం అల్లాడి పోతుంటే… మరోపక్క బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి రావడంతో… సీఎం అభ్యర్థి అంశం పొలిటికల్‌ హీట్‌ ని మరింత పెంచుతోంది. తాజాగా ఆయన విజయవాడలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పనిలో పనిగా ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ పేరుని ఖాయం చేయాలని జనసేన నేతలు పట్టుపడుతున్నారు.

అయితే, కూటమి సీఎం అభ్యర్థి అనేది ఒకరు డిమాండ్‌ చేస్తే ఇచ్చేది కాదని తేల్చి చెప్పారు జీవీఎల్‌. ప్రస్తుతానికి ఈ విషయం సస్పెన్స్ గానే ఉన్నా… త్వరలోనే ఏ విషయం రివీల్ చేయనున్నారు. ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే, పార్టీ బలోపేతంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published.