అగ్నిపథ్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల అయింది. అగ్నిపథ్ పథకం 2022 కి సంబంధించి అగ్నివీర్ తొలి నోటిషికేషన్ జూన్ 24వ తేదీ విడుదల కానుంది. సైన్యంలోని మూడు విభాగాలలోనూ ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో… త్రివిధ ఆర్మీ కమాండర్లు పాల్గొన్నారు. జూన్ 24న ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్స్ పునఃప్రారంభం అవుతుంది. జూన్ 25న నేవీలో నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. జూలై 1న ఆర్మీలో […]
ఇకనుండీ గవర్నమెంట్ స్కూల్స్ లో… బైజూస్ క్లాసులు

ఏపీ ప్రభుత్వం తాజాగా విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ పాఠశాలలకి పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అధునాతన విద్యని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అందుకోసం ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ అయిన ‘బైజూస్’తో ఒప్పందం చేసుకుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు కోసం జగన్ గవెర్నమెంట్ మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులని, ప్రపంచంతో పోటీపడే విధంగా తయారు చేయాలన్నదే ఆయన ఉద్దేశ్యం. అందుకోసం, బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్తో సీఎం జగన్ […]
జనసైనికులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిన నాగబాబు

జనసైనికులంతా రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు హెచ్చరించారు. అందుకోసం వారికి కొన్ని మార్గదర్శకాలు కూడా చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ కూడా చేశారు. ఇదే విషయమై అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు నాగబాబు వరుస ట్వీట్లు చేయడం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ప్రత్యర్థులు […]
IDBI బ్యాంకులో 1544 పోస్టుల భర్తీకి ఆహ్వానం

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 1544 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇందులో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. జూన్ 3, 2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా సరే బ్యాంక్ అధికారిక వెబ్సైట్ idbibank.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 17, 2022. మొత్తం వేకెన్సీస్: ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 1,044 అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ […]
గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న భారత్ (వీడియో)

మోదీ సర్కార్ ఏనిదేళ్ల పాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మరో అరుదైన రికార్డును దక్కించుకుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 75 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించి… భారత్ పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసింది. ఈ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ కేవలం 5 రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో అంతకుముందు ఖతర్ పేరిట ఉన్న గిన్నిస్ రికార్డుని బద్దలు కొట్టింది భారత్. ఈ విషయాన్ని మరెవరో కాదు, కేంద్ర […]
ఫోర్త్ వేవ్ అలర్ట్: భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

మళ్ళీ భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు మళ్ళీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత 24 గంటల్లోనే మనదేశంలో 5,233 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఏడుగురు మరణించారు. సోమవారంతో పోల్చి చూస్తే, మంగళవారం 40% కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలోనే 1,881 కేసులు పెరిగాయి. దీంతో మూడు నెలల తర్వాత యావరేజ్ గా రోజువారీ కేసుల సంఖ్య 5 వేల మార్క్ […]
సరికొత్త నాణాలను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ! వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..!

ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త నాణాలని విడుదల చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (AKAM) వేడుకల్లో భాగంగా ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్‌ను ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా ఆయన ఈ నాణాలను విడుదల చేశారు. కేంద్ర ఆర్ధికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. అదే సమయంలో ఈ కొత్త నాణేలని కూడా ఆవిష్కరించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న […]
కేరళలో కొత్తగా వ్యాపిస్తున్న నోరో వైరస్…

కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ని మరువక ముందే రకరకాల వైరస్ లు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా గతేడాది కేరళని వణికించిన నోరోవైరస్… మళ్ళీ ఇప్పుడు విజ్రుమ్బించింది. తాజాగా కేరళలోని తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతానికి ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కానీ, ఈ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం […]
పవన్ కాబోయే సీఏం?

బీజేపీ, జనసేనల మధ్య సీఎం సీటు పంచాయితీ నడుస్తోంది. రెండు పార్టీల పొత్తుపై గత కొద్ది కాలంగా డిస్కషన్ జరుగుతోంది. ఇక బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వడంలో డిలే చేస్తోందని జనసేన భావిస్తుంటే… అదేం లేదని బీజేపీ చెప్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ-జనసేన కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చాలా చర్చనీయంశాలుగా మారాయి. ఇందులో బీజేపీ, జనసేన […]
మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి!

మనమంతా ఏదో ఒక సమయంలో ఫోన్ పోగొట్టుకొని ఉండవచ్చు. అందులో ముఖ్యమైన, వ్యక్తిగత సమాచారం ఉంటుంది. అదంతా మన చేయి దాటి పోతుంది. అప్పుడెలా..? ఏం చేయాలి..? ఎవరిని సంప్రదించాలి..? ఏం చేస్తే తిరిగి మన డేటా మనకి అందుతుంది. ఇలాంటి సందేహాలు మనకి కలిగి ఉండవచ్చు. నిజానికి ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాని స్మార్ట్‌ఫోన్‌లోనే స్టోర్ చేసుకుంటున్నారు.ఎంత కీలకమైన సమాచారమైనా స్మార్ట్ ఫోన్ నుండే ఆపరేట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు స్మార్ట్ […]